Ad Code

బంగాళాఖాతంలో వాయుగుండం !


క్షిణ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన వాయుగుండం 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో దక్షిణకోస్తా, ఉత్తరకోస్తాలో రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 28, 29న నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తీర ప్రాంతాల్లో 35 నుంచి 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తాలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని.. ఇప్పటికే కోస్తాంధ్రలో ఒకటో నంబర్‌ ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు వెల్లడించింది. ఉత్తర కోస్తా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Post a Comment

0 Comments

Close Menu