మధుమేహ వ్యాధిగ్రస్తులు వేరుశనగలను తీసుకుంటే ఒకే సారి బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోకుండా ఉంటాయి. చాలా మంది షుగర్ తో బాధపడే వాళ్ళు, పల్లీలు తీసుకోవచ్చా లేదా అని అడుగుతూ ఉంటారు. అయితే పల్లీలను తీసుకోవడం వల్ల పెద్ద ప్రమాదం ఉండదు. షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఎటువంటి నష్టం ఉండదు. అలానే నీళ్లతో షుగర్ ని తగ్గించుకోవచ్చా లేదా అనే సందేహం కూడా చాలా మందిలో ఉంటుంది. డయాబెటిస్ మొత్తం నీటితో తగ్గదు. కానీ బాగా ఎక్కువగా డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు కొంత వరకు తగ్గించుకోవచ్చు. గ్లూకోస్ లెవెల్స్ అయితే తగ్గిపోవు. కానీ బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. డయాబెటిస్ తో బాధపడే వాళ్ళకి ఎక్కువ అలసట ఉంటుంది. ఇది తగ్గాలంటే నీళ్ళని బాగా తీసుకుంటూ ఉండాలి. దానితో పాటుగా కొంచెం సేపు వ్యాయామం చేయాలి. రోజులో ఒక గంట సేపు వ్యాయామానికికి మీ సమయాన్ని వెచ్చిస్తే, ఆరోగ్యం బాగుంటుంది.
0 Comments