ఇజ్రాయెల్‌లో హెజ్‌బొల్లా ఉగ్రవాదులు జరిపిన వైమానిక దాడుల్లో ఏడుగురు ఇజ్రాయెల్ పౌరులు మరణించినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ అధికారులు వెల్లడించారు. హెజ్‌బొల్లా ఉగ్రవాదులు లెబనాన్ నుంచి నార్తన్ ఇజ్రాయెల్‌పై జరిపిన వైమానిక దాడుల్లో నలుగురు విదేశీయులు, ముగ్గురు ఇజ్రాయెల్ పౌరులు మరణించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) తెలిపింది. ముందుగా నార్తన్ ఇజ్రాయెల్ ప్రాంతంలో వైమానిక దాడులు జరిపింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు.స్వల్ప వ్యవధిలో ఇజ్రాయెల్‌లోని వ్యవసాయ క్షేత్రాలకు నిలయమైన మెతులా ప్రాంతం ధ్వంసమైంది. ఆ తర్వాత వెనువెంటనే 25 రాకెట్లను ఇజ్రాయెల్ పోర్ట్ సిటీ హైఫాపై ప్రయోగించింది. ఈ ఘటనలో మృతుల సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది. హెజ్‌బొల్లా దాడులపై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ ఆర్మీ గట్టిగా బదులిచ్చింది. హెజ్‌బొల్లాను వదిలిపెట్టం. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది.
0 Comments