దేశంలో ఇంటర్నెట్ సర్వీస్ శైలి మారబోతోంది. ఎందుకంటే ఎలోన్ మస్క్ కంపెనీ స్టార్‌లింక్ శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవ త్వరలో అందుబాటులోకి రానున్నాయి. స్టార్‌లింక్ ఇంటర్నెట్ సర్వీస్ లైసెన్స్ పొందడానికి అవసరమైన ప్రక్రియను పూర్తి చేసే పనిలో ఉందని ఇటీవల కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయినా స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ భారత్‌లోకి ఎంట్రీ ఇవ్వనుందని అర్థం అయ్యింది. అయితే ముఖ్యమైన విశేషమేమిటంటే స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు చాలా భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే దాని కనెక్షన్ కోసం భూగర్భంలో ఎటువంటి వైర్ వేయాల్సిన అవసరం లేదు. అలాగే మొబైల్ టవర్ ఇన్‌స్టాల్ అవసరం ఉండదు. స్టార్‌లింక్ అనేది శాటిలైట్ ఇంటర్నెట్ సేవ. వైర్లు, కేబుల్స్ & మొబైల్ టవర్లు లేని మారుమూల గ్రామాలకు హైస్పీడ్ ఇంటర్నెట్, కాలింగ్ సౌకర్యాలను అందించడం దీని ప్రత్యేకత. ఇది గ్లోబల్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్. వాస్తవానికి చాలా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలు బ్రాడ్‌బ్యాండ్ డేటాను పంపడానికి ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలను ఉపయోగిస్తాయి. దీని కారణంగా, ఇంటర్నెట్ నగరాల్లో బాగా పనిచేస్తుంది. కానీ మారుమూల ప్రాంతాలు, పర్వతాలు లేదా అడవుల్లో ఉండే గ్రామాలలో ఇంటర్నెట్ వేగం బాగా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో కేబుల్స్ వేయడం కష్టమైన పని. కానీ స్టార్‌లింక్‌కి ఈ అవసరం ఏం ఉండదు. కాబట్టి ఇది గ్రామాల్లో కూడా అంతే వేగంగా పనిచేస్తుంది. గ్రామాల్లోనే కాదు. ఈ భూమి మీద మనం ఎక్కడున్నా అదే స్థాయిలో ఇంటర్నెట్ అందిస్తుంది. దేశంలో భారీ వర్షాలు పడ్డాయి అంటే చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలుగుతుంది. ఎందుకంటే అవి భూమి మీద ఉన్న సెల్ టవర్లు, ఇతర ఇంటర్నెట్ కనెక్షన్ల నుంచి ప్రజలకు సేవలు అందిస్తాయి. కానీ స్టార్‌లింక్‌కి ఎలాంటి కనెక్షన్స్ అవసరం లేదు. కాబట్టి భారీ వర్షాలు పడ్డా, వాతావరణం బాగాలేకున్నా, ఏ సమస్యలు వచ్చినా ఇంటర్నెట్ ఆగదు. స్టార్‌లింక్ చిన్న ఉపగ్రహాల శ్రేణి ద్వారా హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. స్టార్‌లింక్ సెకనుకు 150 మెగాబిట్ల ఇంటర్నెట్ వేగాన్ని అందిస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యధికం. దానితో పోల్చదగిన సంస్థ లేదు. స్టార్‌లింక్ ప్రస్తుతం 36 దేశాల్లో ఉంది.
0 Comments