Ad Code

మధుమేహం - కంటి చూపు !


ధుమేహం వున్న వారిలో  రక్తంలో చక్కెర స్థాయి అధికంగా ఉండటం వల్ల కళ్ళపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఈ ప్రభావం గనక అదుపులో లేకపోతే శాశ్వత అంధత్వానికి కూడా దారితీస్తుంది. కాబట్టి, మధుమేహ రోగులు తమ కళ్ళను ఎలా సంరక్షించుకోవాలో తెలుసుకోవడం కీలకం. డయాబెటిక్ రోగులు చూపు సమస్యతో ఇబ్బంది పడతారు. డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం 18 సంవత్సరాల కంటే పై వయస్సు గల 77 మిలియన్ల భారతీయులు మధుమేహంతో బాధపడుతున్నారు. వీరిలో సగం మందికి తమ ఆరోగ్యం గురించి స్పష్టమైన అవగాహన ఉండడం లేదు. ఈ సంఖ్య 2045 నాటికి రెట్టింపు అయ్యే అవకాశముంది. ఎక్కువ మంది కంప్యూటర్ వర్క్, అసమతుల ఆహారం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాలతో మధుమేహానికి గురవుతున్నారు. దీని వల్ల మధుమేహం తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి రోజువారీ జీవితంలో వ్యాయామం, సరైన ఆహారం అనుసరించడం చాలా ముఖ్యమైంది. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో లేకపోతే సైట్ పెరగడం అనివార్యం. ఇది కళ్ళకు అధిక ప్రభావం చూపిస్తుంది. కాబట్టి కంటి సమస్యలను లైట్‌గా తీసుకోవకుండా వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి. రెటీనా పరిశీలన ద్వారా కంటి ఆరోగ్యంపై స్పష్టమైన అవగాహన పొందవచ్చు. దీని ఆధారంగా వ్యాధి తీవ్రతను అంచనా వేసి చికిత్స అందించవచ్చు. లేజర్ ఫోటోకోగ్యులేషన్ కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడే ముఖ్యమైన చికిత్స. అవసరమైతే రెగ్యులర్ ఫాలో-అప్‌తో పాటు ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్ చేస్తే రోగి దృష్టి మెరుగుపడుతుంది. శరీరానికి అవసరమైన పోషకాలను అందించే ఆహారం తీసుకోవడం. క్రమం తప్పకుండా వ్యాయామం రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించడం, వారి సూచనలతో చికిత్స తీసుకోవడం మంచిది.

Post a Comment

0 Comments

Close Menu