మెజాన్‌ క్విక్‌ కామర్స్ రంగంలో ప్రవేశించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంది. 2025 తొలి నాలుగు నెలల్లో లాంచ్‌ చేయాలని భావించినట్లు తెలిసింది. డిసెంబర్‌ 9, 10 తేదీల్లో అమెజాన్‌ రివ్యూ మీటింగ్‌ లో దీనిపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. సంభవ్‌ పేరుతో అమెజాన్ వార్షిక సమావేశం నిర్వహించనుంది. ప్రస్తుతం అమెజాన్‌ తేజ్‌ కోడ్‌నేమ్‌ తో క్విక్‌ కామర్స్‌ కోసం ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందుకోసం అవసరమైన సిబ్బంది నియామకాలు కూడా అమెజాన్ చేపట్టినట్లు తెలుస్తోంది. క్విక్‌ కామర్స్‌ కోసం స్టాక్‌ కీపింగ్‌ యూనిట్‌ లు, డార్క్‌ స్టోర్‌ లు సహా ఇతర లాజిస్టిక్‌, ఇన్‌ఫ్రా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. అయితే ఏ పేరుతో అందుబాటులోకి తీసుకురానుందో సంస్థ వెల్లడించలేదు. ఇప్పటికే అనేక సంస్థలు క్విక్‌ కామర్స్‌ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరో ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ కూడా ఈ సంవత్సరం ప్రారంభంలో మినిట్స్‌ పేరుతో క్విక్‌ కామర్స్‌ లోకి ఇప్పటికే ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ప్రధాన నగరాలకు విస్తరించింది. టాటా న్యూ సూపర్‌ తోపాటు బిగ్‌బాస్కెట్‌ కూడా ఉన్నాయి. మరో వైపు ప్రముఖ వ్యాపార దిగ్గజం రిలయన్స్‌ కూడా క్విక్‌ కామర్స్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం చివరి నాటికి $7 బిలియన్‌లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం అనేక సంస్థలు ఈ రంగంలో రాణిస్తున్నాయి. త్వరలో అందుబాటులోకి రానుందని భావిస్తున్న అమెజాన్‌ క్విక్‌ కామర్స్‌ ప్లాట్‌ఫాం... వీటితో పోటీని ఎదుర్కొవాల్సి ఉంటుంది.