స్పామ్ కాల్స్ సమస్య అధికమవుతున్న నేపథ్యంలో గూగుల్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. గూగుల్ పిక్సల్ ఫోన్‌లకు తొలుత ఈ ఫీచర్ విడుదల కానుంది. రియల్‌టైంలో స్పామ్ కాల్స్ ను గుర్తించే విధంగా ఈ ఫీచర్ ను రూపొందించారు. తొలిసారిగా ఈ ఫీచర్ గురించి గూగుల్ I/O 2024 లో వెల్లడించారు. గూగుల్ స్పామ్ కాల్స్ డిటెక్షన్ ఫీచర్ కాల్ సంభాషణ వింటుంది. ఒకే తరహా సంభాషణలను ఉంటే వెంటనే గుర్తిస్తుంది. ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే వెంటనే సౌండ్ మరియు వైబ్రేషన్ ద్వారా యూజర్లను అలెర్ట్ చేస్తుంది. దీంతోపాటు డిస్‌ప్లే పైన Likely Scam అంటూ ఓ వార్నింగ్ మెసెజ్ కూడా కనిపిస్తుంది. దీంతోపాటు hang up లేదా రిపోర్టు అనే ఆప్షన్ లు కూడా ఉంటాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ గూగుల్ పిక్సల్ 9 సిరీస్ లో అందుబాటులో ఉంది. దీంతోపాటు పిక్సల్ 6 నుంచి 8a మోడళ్లు వరకు ఈ ఫీచర్ ను వినియోగించుకోవచ్చు. ఈ గూగుల్ కొత్త ఫీచర్ యూజర్ల కాల్స్‌ను వింటున్నా.. భద్రత పరంగా, గోప్యత పరంగా సురక్షితంగా ఉంటుందని తెలిపింది. కాల్స్ స్టోర్ చేయడం లేదా ఇతరులకు షేర్ చేయడం జరగదని గూగుల్ హామీ ఇస్తోంది. గూగుల్ పిక్సల్ ఫోన్ లలో ఈ స్కామ్ డిటెక్షన్ ఫీచర్ ఆఫ్ లో ఉంటుందని తెలిపింది. స్పామ్ కాల్స్ తో ఎక్కువగా ఇబ్బంది ఎదుర్కొనే యూజర్లు ఫోన్ యాప్ ద్వారా ఫీచర్ ను యాక్టివేట్ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం సెట్టింగ్స్ లోని స్కామ్ డిటెక్షన్ ఫీచర్ కోసం సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ పబ్లిక్ బీటా వెర్షన్ అమెరికాలో విడుదల అవుతోంది. గూగుల్ పిక్సల్ 6 తోపాటు తర్వాత విడుదల అయిన గూగుల్ స్మార్ట్‌ఫోన్‌లు ఈ ఫీచర్ ను సపోర్టు చేస్తాయి. అయితే భారత్ సహా గ్లోబల్ మార్కెట్ లో ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే వివరాలను వెల్లడించలేదు.
0 Comments