వివిధ సర్వీసుల కోసం రైల్వేలో అనేక యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. టికెట్‌ల బుకింగ్ కోసం ఐఆర్సీటీసీ వైబ్‌సైట్, యాప్ ఉంది. అన్ రిజర్వడ్, ప్లాట్‌ఫాం టికెట్ల కోసం యూటీఎస్, ఫిర్యాదులు సహా రివ్యూ, ఫీడ్‌బ్యాక్ కోసం రైల్ మదద్ ఉన్నాయి. వీటితోపాటు రైళ్లలో నుంచి ఫుడ్ ఆర్డర్ చేసేందుకు ఐఆర్‌సీటీసీ ఈ కేటరింగ్ ఫుడ్ ఆన్ ట్రాక్ సర్వీసులు ఉన్నాయి. మరియు ట్రైయిన్ ట్రాకింగ్ కోసం నేషనల్ ట్రైయిన్ ఎంక్వైరీ సిస్టమ్ వంటి సర్వీసులు వేర్వేరుగా ఉన్నాయి. రైలు ప్రయాణికులు వివిధ అవసరాల కోసం ఈ యాప్‌లు, వెబ్‌సైట్‌లను ఉపయోగించాల్సి వస్తోంది. ఈ సర్వీసులు అన్నింటినీ ఒకే ప్లాట్‌ఫాం కిందకు తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ ఎప్పటి నుంచో కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఓ సూపర్ యాప్‌ను తీసుకురానుంది. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఈ సూపర్ యాప్‌ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఉన్న ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ యాప్‌తో కొత్త యాప్‌ను ఇంటిగ్రేట్ చేసే ప్రక్రియ కొనసాగుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం వేర్వేరు రైల్వే సేవల కోసం ప్రయాణికులు వివిధ రకాల థర్డ్ పార్టీ యాప్‌లు వినియోగిస్తున్నారు. ఈ సేవలు అన్నీ ఒకే ప్లాట్‌ఫాం కిందకు వస్తే ప్రయాణికులకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ రైల్వే సూపర్ యాప్ ఈ సంవత్సరం డిసెంబర్ చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఐఆర్సీటీసీ యాప్ 100 మిలియన్‌ల కంటే ఎక్కువ డౌన్‌లోడ్‌లను కలిగి ఉంది. మరియు రైల్వేలో ఎక్కువగా వినియోగిస్తున్న యాప్‌గా ఉంది. థర్డ్ పార్టీ యాప్‌లు కూడా రైల్వే టికెట్ల రిజర్వేషన్ కోసం ఐఆర్సీటీసీ పైన ఆధారపడి పనిచేస్తాయి.
0 Comments