ఢిల్లీలో వాయు కాలుష్యం దారుణంగా ఉంది. అధిక కాలుష్యంతో అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో.. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలను వేర్వేరు సమయాల్లో తెరవాలని ఆదేశాలు జారీ చేశారు. మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ పరిధిలోని కార్యాలయాలు ఉదయం 8:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు తెరిచి ఉంటాయి. ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 10 నుండి సాయంత్రం 6:30 వరకు తెరిచి ఉంటాయి. ఈ టైమ్‌టేబుల్ ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని కార్యాలయాల్లో 2025 ఫిబ్రవరి 28 వరకు అమలులో ఉండనుంది. ఢిల్లీ ప్రభుత్వ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కాలుష్యం కారణంగా ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్, ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాల సమయాలను మార్చినట్లు తెలిపింది. సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన సూచనలలో.. GRAP నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయాల సమయాల మార్పుకు ఆమోదం తెలిపారు. ఈ క్రమంలో.. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాలు ఉదయం 8.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు తెరిచి ఉంటాయి. ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 10.00 నుండి సాయంత్రం 6.30 వరకు తెరిచి ఉంటాయి. కార్యాలయ సమయాల్లో ఈ మార్పు 28 ఫిబ్రవరి 2025 వరకు అమలులో ఉంటుంది. ఇదిలా ఉండగా.. గ్రేప్-4 కింద విధించిన ఆంక్షలను అమలు చేసేందుకు తక్షణమే బృందాలను ఏర్పాటు చేయాలని ఢిల్లీ-ఎన్‌సీఆర్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గాలి నాణ్యత సూచిక 450 కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, అగస్టిన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. 12వ తరగతి వరకు తరగతులు నిర్వహించడంపై తక్షణ నిర్ణయం తీసుకోవాలని అన్ని ఢిల్లీ-ఎన్‌సీఆర్ రాష్ట్రాలను కోర్టు కోరింది.
0 Comments