Ad Code

దేశంలో 85 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్ ?


దేశంలో ఆగస్టు నెలలో 84.58 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్ అయ్యాయి. సెప్టెంబరు నెలలో మరో 85 లక్షల భారతీయ వాట్సాప్ అకౌంట్లను వాట్సాప్ కంపెనీ బ్యాన్ చేసింది. భారత ప్రభుత్వ ఐటీ చట్టం 2021లోని రూల్స్‌ను ఉల్లంఘించే వాట్సాప్ అకౌంట్లపై ఆ కంపెనీ కొరడా ఝుళిపిస్తోంది. అలాంటి వాట్సాప్ అకౌంట్లను ఎప్పటికప్పుడు గుర్తించి బ్యాన్ విధిస్తోంది. తాజాగా సెప్టెంబరులో బ్యాన్‌కు గురైన 85 లక్షల భారతీయ వాట్సాప్ అకౌంట్లలో దాదాపు 16.58 లక్షల అకౌంట్లపై వాట్సాప్ కంపెనీకి ఫిర్యాదులేం అందలేదు. అయినా వాటిని బ్యాన్ చేశారు. అవి ఐటీ చట్టంలోని రూల్స్‌ను అతిక్రమించి నడుస్తున్నాయి. ఆయా వాట్సాప్ అకౌంట్లను దుర్వినియోగం చేస్తున్నారు. కొన్ని వాట్సాప్ అకౌంట్ల ద్వారా ప్రజలను మోసగించే సమాచారాన్ని వైరల్ చేస్తున్నారు. ఇంకొన్ని వాట్సాప్ అకౌంట్ల ద్వారా బల్క్‌, స్పామ్‌ మెసేజులను పంపుతున్నారు. ఇలా చేయడం భారతీయ చట్టాలకు విరుద్ధం. ఈవిషయాన్ని వాట్సాప్ కంపెనీ టీమ్స్ గుర్తించాయి. అందుకే ఆయా వాట్సాప్ అకౌంట్లపై ఫిర్యాదులు రాకున్నా.. బ్యాన్ లిస్టులో చేర్చింది. మనదేశంలో దాదాపు 60 కోట్ల వాట్సాప్ అకౌంట్లు ఉన్నాయి. 

Post a Comment

0 Comments

Close Menu