అమెజాన్, ఆఫ్‌లైన్ ఛానెల్‌ల నుంచి రియల్ మీ జీటీ 7 ప్రో ని ప్రీ-ఆర్డర్ ద్వారా చేసుకోవచ్చు. కొనుగోలుదారులు అమెజాన్‌లో రూ. 1,000 ముందే చెల్లించాల్సి ఉంటుంది. రియల్ మీ జీటీ 7 ప్ ని ప్రీ-బుక్ చేయడం ద్వారా ఫోన్‌పై రూ. 3,000 బ్యాంక్ ఆఫర్‌తో పాటు 12 నెలల నో కాస్ట్ ఈఎంఐ , ఒక సంవత్సరం స్క్రీన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్, ఒక సంవత్సరం అడిటోషనల్ వారంటీని పొందవచ్చు. ఈ ఫోన్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చౌకైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఫోన్‌లలో ఒకటిగా స్థానం గెలుచుకుంది. చైనాలో దీని ప్రారంభ ధర 3699 యువాన్లు అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 44,000, టాప్ ఎండ్ వేరియంట్ అయితే 4799 యువాన్ రూ.57,000 వరకు ఉంది. ఇండియాలో దీని స్పెసిఫికేషన్‌లు విడుదల కాలేదు, అయినప్పటికీ చైనీస్ వేరియంట్‌ను చూస్తే మనకు Realme GT 7 Pro 6.78 అంగుళాల ఉంటుంది. 1.5K 8T LTPO కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది గరిష్టంగా 6,000 nits బ్రైయట్‌నెస్‌ను ఇస్తుంది. 120Hz వరకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఫోన్ HDR10+, డాల్బీ విజన్, 2,600Hz ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్, 120% DCI-P3 కలర్ గాముట్, 2600Hz PWM డిమ్మింగ్‌కు సహకరిస్తుంది. Snapdragon 8 Elite ప్రాసెసర్, 16GB వరకు LPDDR5X RAM, 1TB వరకు UFS 4.0 స్టోరేజ్‌ను అందిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారంగా Realme UI 6.0పై నడుస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌కి 3 సంవత్సరాల OS అప్‌డేట్‌లు, 4 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లను ఇస్తుంది. ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు 6,500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఆప్టిక్స్ పరంగా, GT 7 ప్రో 50MP ప్రైమరీ షూటర్, 50MP సోనీ IMX882 3x టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో సహా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 16MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.
0 Comments