బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం చవకైన వార్షిక రీఛార్జ్ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశంలోని ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఇటీవల రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచాయి. ఆ తర్వాత ప్రజలు బీఎస్ఎన్ఎల్ వైపు ఆకర్షితులు కావడం ప్రారంభం అయింది. నెలనెలా బీఎస్ఎన్ఎల్ కు వచ్చే వినియోగదారుల సంఖ్య కూడా పెరుగుతోంది. బీఎస్ఎన్ఎల్ లాంచ్ చేసిన ఈ చవకైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 1,198గా ఉంది. ఈ రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు లేదా 12 నెలలుగా ఉంది. దేశవ్యాప్తంగా ఏ నంబర్ కు అయినా కాల్ చేయడానికి వినియోగదారులకు ప్రతి నెలా 300 ఉచిత నిమిషాలు అందిస్తారు. ఇది మాత్రమే కాకుండా ఈ ప్లాన్ లో వినియోగదారులు ప్రతి నెలా 3 జీబీ హై స్పీడ్ 3జీ/4జీ డేటాను పొందుతారు. దీంతోపాటు ప్రతి నెలా 30 ఉచిత ఎస్ఎంఎస్ కూడా లభిస్తాయి. కొత్త ప్లాన్ ను ప్రారంభించడంతో పాటు బీఎస్ఎన్ఎల్ తన 365 రోజుల రీఛార్జ్ ప్లాన్లలో ఒకదాని ధరను కూడా తగ్గించింది. కంపెనీ తన రూ.1,999ను ప్లాన్ ధరను రూ. 100 తగ్గించింది. దీని ప్రయోజనాల గురించి చెప్పాలంటే ఇందులో యూజర్లు అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు. అదే సమయంలో రోజువారీ పరిమితి లేకుండా మొత్తంగా 600 జీబీ డేటాను పొందుతారు. దీంతో పాటు ప్లాన్ లో వినియోగదారులకు ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్ కూడా అందిస్తారు. ఈ ప్లాన్ ధర ఇంతకు ముందు రూ. 1,999గా ఉంది. ఇప్పుడు దీన్ని రూ. 1899కి తగ్గించారు. బీఎస్ఎన్ఎల్ సిమ్ ను యాక్టివ్ గా ఉంచి సెకండరీ సిమ్ గా ఉపయోగించాలనుకునే వారికి ఈ ప్లాన్ ఉత్తమంగా ఉంటుందని అనుకోవచ్చు.
0 Comments