Ad Code

సెన్సెక్స్‌ 30 సూచీలో జొమాటో ?

జొమాటో సెన్సెక్స్‌ 30 సూచీలో చేరనుంది. ప్రస్తుతం ఈ సూచీలో ఉన్న జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ను ఇది రీప్లేస్ చేయనుంది. డిసెంబర్‌ 23 నుంచి ఈ మార్పు అమల్లోకి రానుంది. సెన్సెక్స్‌ 30తో పాటు బీఎస్‌ఈ 100, బీఎస్‌ఈ 50, బీఎస్‌ఈ నెక్ట్స్‌ 50 సూచీల్లోనూ మార్కెట్‌ ముగిసిన అనంతరం బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ ఈ మార్పులు చేపట్టింది. జొమాటో షేర్లు శుక్రవారం 0.72 శాతం క్షీణించి రూ.265 వద్ద ముగిశాయి. ఏడాదిలో ఈ షేరు 130 శాతం మేర ప్రతిఫలం ఇచ్చింది. మరోవైపు 43 స్టాక్స్‌కు ఫ్యూచర్‌ అండ్‌ ఆప్షన్స్ కాంట్రాక్టుల్లో బీఎస్‌ఈ చోటు కల్పించింది. ఇందులో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ టోటల్‌ గ్యాస్‌, వన్‌ 97 కమ్యూనికేషన్స్‌, యెస్‌ బ్యాంక్‌, అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ (డీమార్ట్‌), ఎల్‌ఐసీ, జొమాటో, జియోఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ షేర్లు ఉన్నాయి. డిసెంబర్‌ 13 నుంచి ఈ కొత్త కాంట్రాక్టులు ప్రారంభం కానున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu