Ad Code

అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ. 20,000 !


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ.20వేలు ఇస్తుందన్నారు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు. శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రతి ఏటా అర్హులైన రైతులందరికి రూ.20 వేలు అందజేస్తామని, ఇందులో పీఎం కిసాన్ రూ.6 వేలు, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.14 వేలు కలిపి ఇస్తుందని చెప్పారు. 41.4 లక్షల మంది రైతులకు ఈ పథకం అందిస్తామని, ఇందుకోసం ఇప్పటికే బడ్జెట్లో రూ.4,500 కోట్లు కేటాయించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా పేరుతో చెప్పిందొకటి, చేసిందొకటన్నారు. 2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీ రైతులకు రూ.12,500 ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారని.. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం ఇచ్చిన రూ.6వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500 కలిపి రూ.13,500 ఇచ్చిందన్నారు. తాము మాత్రం అలా కాకుండా కేంద్రం పీఎం కిసాన్ కింద ఇచ్చే రూ.6వేలకు.. రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.16వేలు కలిపి రూ.20వేలు ఇస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో రైతులకు ఒక్క అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తే సరిపోదన్నారు. 

Post a Comment

0 Comments

Close Menu