Ad Code

18 లక్షల విలువ చేసే ఎండీఎంఏ డ్రగ్స్ ను సీజ్ చేసిన పోలీసులు !


హైదరాబాద్ లోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుల్మోహర్ పార్క్ లోని ఓ వైద్యుడి ఇంట్లో డ్రగ్స్ పార్టీకి ప్లాన్ చేశారు నిందితులు. అయితే పక్క సమాచారంతో ఆ ఇంటి పై చందానగర్ పోలీసులు దాడులు జరిపారు. ఈ తరుణంలోనే రాజస్థాన్ నుండి డ్రగ్స్ తెచ్చి నగరంలో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఘటన స్థలంలో 18 లక్షల విలువ చేసే 150 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను పోలీసులు సీజ్ చేశారు. ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకోగా మరో ఐదుగురు పరారయ్యారు. కేసు నమోదు చేసుకొని చందానగర్ పోలీసులుదర్యాప్తు చేస్తున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu