ఆపిల్ నుంచి ఐఫోన్ SE 4 ఫోన్ త్వరలో విడుదల కానుంది. కొన్ని లీక్‌ల ఆధారంగా ఐఫోన్ SE 4 మోడల్ 2025 మార్చి నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మోడల్ అనేక అత్యాధునిక ఫీచర్‌లతో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఆపిల్ ఇంటెలిజెన్స్, యాక్షన్ బటన్, ఫేస్ ఐడీ వంటి ఫీచర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ ఐఫోన్ 14 తరహా డిజైన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. గత మోడల్‌తో పోలిస్తే భారీ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని సమాచారం. బ్లూమ్‌బర్క్ మార్క్ గుర్మన్ లీక్స్ ఆధారంగా ఐఫోన్ SE 4 మోడల్ నాచ్‌తో కూడిన ఎడ్జ్ టూ ఎడ్జ్ స్క్రీన్‌తో ఐఫోన్ 14 తరహా డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఐఫోన్ SE 3 కేవలం 4.7 అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉండగా.. ఐఫోన్ SE 4 మోడల్ 6.1 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. డిస్‌ప్లే పరంగా భారీ మార్పుగా భావించవచ్చు. ప్రస్తుతం ఐఫోన్ ప్రో, ప్రో మ్యాక్స్, ఐఫోన్ 16 సిరీస్‌కే పరిమితం అయిన ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ కొత్తగా లాంచ్ కానున్న ఐఫోన్ SE లోనూ అందుబాటులో ఉంటుందని గుర్మన్ తెలిపారు. దీంతోపాటు ఐఫోన్ SE 4 మోడల్ యాక్షన్ బటన్, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ మోడల్ 8GB ర్యామ్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. కెమెరా విభాగం పరంగా 48MP కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు తక్కువ ధరలోనే ఐఫోన్ SE మోడళ్లను అందుబాటులోకి వచ్చాయి. అయితే కొన్ని ఆధునిక ఫీచర్‌ల కారణంగా గత మోడళ్ల కంటే ఎక్కువ ధరను కలిగి ఉండే అవకాశం ఉంది. ఐఫోన్ SE 3 ధర రూ.43,900 గా ఉండగా.. ఐఫోన్ SE 4 ధర సుమారు రూ.49,900 గా ఉండే అవకాశం ఉంది.
0 Comments