బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు అత్యంత సన్నిత సంబంధాలున్న బాబా సిద్ధిఖీని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ లక్ష్యంగా చేసుకొని ఈ నెల 12న కాల్చి చంపింది. ఆ తర్వాత సల్మాన్ గెలాక్సీ అపార్ట్ మెంట్ పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి. అక్కడ ఎవరూ సెల్ఫీలు, వీడియోలు తీసుకోకుండా పోలీసులు నిషేధం విధించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పోలీసులు చుట్టుముట్టారు. మీడియా సిబ్బందిని కూడా అనుమతించడం లేదు. మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య నేపథ్యంలో సల్మాన్ ఖాన్ భద్రతను వై ప్లస్ కి పెంచారు. ఎస్కార్ట్ వాహనం కూడా ఏర్పాటు చేశారు. అలాగే, శిక్షణ పొందిన సాయుధ కానిస్టేబుల్ సైతం వెంట వెళ్లనున్నాడు.
0 Comments