సనాతన ధర్మ నిర్మూలనను సమర్థిస్తూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు తాను క్షమాపణలు చెప్పబోనని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, వివాదానికి దారితీసిందని అన్నారు. సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి మాట్లాడుతూ, పెరియార్, మాజీ ముఖ్యమంత్రి సిఎన్ అన్నాదురై, ఎం కరుణానిధి వంటి ద్రావిడ నాయకుల అభిప్రాయాలను తాను ప్రతిధ్వనించానని అన్నారు. మహిళలను చదువుకోవడానికి అనుమతించలేదు.. వారు తమ ఇళ్లను వదిలి వెళ్ళలేకపోయారు, భర్త చనిపోతే, వారు కూడా చనిపోవాలి. వీటన్నింటికీ వ్యతిరేకంగా తంతై పెరియార్ మాట్లాడారు. పెరియార్, అన్నా, కలైంజ్ఞర్ చెప్పిన దానినే నేను ప్రతిధ్వనించానని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. రాష్ట్రంపై హిందీని రుద్దే ప్రయత్నం జరుగుతోందని, తమిళనాడు గీతంలో ఇటీవలి మార్పులే ఈ ప్రయత్నాలకు నిదర్శనమని ఆయన ఆరోపించారు. ఇటీవల దూరదర్శన్ తమిళ కార్యక్రమంలో రాష్ట్ర గీతం నుండి ఉద్దేశపూర్వకంగా కొన్ని పదాలను తొలగించారని ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు.
0 Comments