ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ జొమాటో కొత్త బిజినెస్ రంగంలోకి వెళ్లడం లేదని తేల్చేసింది. ప్రస్తుతం నాలుగు విభాగాల్లో వ్యాపార లావాదేవీలపైనే ఫోకస్ చేస్తున్నామని సోమవారం వివరణ ఇచ్చింది. జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ తాజాగా కొత్తగా హెల్త్ అండ్ వెల్ నెస్ ఫర్మ్ 'కంటిన్యూ' ఏర్పాటు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇది తన వ్యక్తిగత ఇన్షియేటివ్ వెంచర్ అని కూడా తెలిపారు. గోయల్ తన మేనేజ్ నేపథ్యంలో పలు క్యూరియాసిటీ గల సందేశాలు తనకు వచ్చాయని, తాను కొత్తగా ఏర్పాటు చేసే హెల్త్ అండ్ వెల్ నెస్ ఫర్మ్ 'కంటిన్యూ' పూర్తిగా తన సొంతం అని స్పష్టం చేశారు. జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ పోస్టు నేపథ్యంలో జొమాటో అధికార ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. తమ సంస్థ ప్రస్తుతం లావాదేవీలు నిర్వహిస్తున్న నాలుగు వ్యాపార సంస్థల (ఫుడ్ డెలివరీ, బ్లింకిట్, హైపర్ ప్యూర్, డిస్ట్రిక్ట్) పై మాత్రమే ఎక్కువగా దృష్టి సారించామని సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో పోస్టు పెట్టారు. తన సంస్థ ప్రారంభంపై ఎప్పటికప్పుడు అప్ డేట్స్ అందిస్తానని హామీ ఇచ్చారు.
0 Comments