Ad Code

మల్బరీ పండ్లు - ఆరోగ్య ప్రయోజనాలు !


ల్బరీ పండ్లు కణాలను ఆరోగ్యంగా ఉంచటం లో ఎంతో సహాయ పడతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. దీనిలో ఉన్న ఫ్లేవనాయిడ్స్ ఆక్సీకరణ ఒత్తిడిని కూడా నియంత్రిస్తాయి.వీటిని తినడం వలన వయస్సు తో పాటుగా వచ్చే కంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. డయాబెటిస్ తో ఇబ్బంది పడే వారికి మల్బరీ పండ్లు ఎంతో మేలు చేస్తాయి. రోజూ తీసుకోవటం వలన షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది. అలాగే దీనిలో ఉన్న ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. ఈ మల్బరీ తో చర్మం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. దీనిని రోజు కచ్చితంగా తీసుకోవడం వలన గుండె ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడుతుంది. వీటిలో ఉన్న ఆంథోసైనిన్లు మరియు రెస్వారెట్రాల్ యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. మల్బరీ పండ్లలో ఉన్నటువంటి పోషకాలు మరియు ఫ్లేవనాయిడ్స్ కంటి సమస్యలను నయం చేయటంలో ఎంతో హెల్ప్ చేస్తాయి. వీటిని గనక తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి కూడా బలంగా మారుతుంది. దీనిలోని విటమిన్ సి ఇన్ఫెక్షన్లను కూడా నయం చేయటంలో ఎంతో హెల్ప్ చేస్తుంది. అలాగే మల్బరీ పండ్లను తినడం వలన తెల్ల రక్త కణాల సంఖ్య అనేది బాగా పెరుగుతుంది. ఈ పంటలో ఉన్న ప్లేవనాయిడ్స్ అభిజ్ఞ పని తీరును కూడా ఎంతగానో మెరుగుపరుస్తుంది. అలాగే ఈ పండ్లను తీసుకోవటం వలన మెదడు పనితీరు మెరుగుపరటమే కాకుండా జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. 

Post a Comment

0 Comments

Close Menu