దేశీయ మార్కెట్లో ఆపిల్ ఐప్యాడ్ మినిని విడుదల చేసింది. ఈ ఐప్యాడ్ అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లతో అందుబాటులోకి వచ్చింది. ఈ ఐప్యాడ్ మిని A17 ప్రో చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంది. పోర్టబుల్ డిజైన్‌తో అందుబాటులో ఉంది. గత మోడళ్ల కంటే అనేక అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంది. ఆపిల్ ఐప్యాడ్ మిని 8.3 అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ కొత్త ఐప్యాడ్ A17 ప్రో చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ను ఐఫోన్ 15 ప్రో మోడల్‌లో వినియోగించారు. ఐప్యాడ్ గత మోడళ్లతో పోలిస్తే డబుల్ వేగంతో పనిచేస్తుందని సంస్థ చెబుతోంది. ఆపిల్ పెన్సిల్ ప్రోను సపోర్టు చేస్తుంది. ఐప్యాడ్ మిని డిజైన్ పరంగా ఆకర్షణీయంగా ఉంది. ఫ్లాట్ సైడ్స్‌తో అందుబాటులో ఉంది. ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్ తరహా డిజైన్‌ను కలిగి ఉంది. పోర్టబుల్ గా ఉంది. గత మోడళ్లతో పోలిస్తే అనేక అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది. కెమెరా పరంగా వెనుకవైపు 12MP వైడ్ కెమెరాను కలిగి ఉంది. ముందువైపు 12MP అల్ట్రావైడ్ కెమెరాను అమర్చారు. ఈ కెమెరా సెంటర్ స్టేజ్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. వీడియో కాల్స్ సమయంలో ఫ్రేమ్ మధ్యలో ఉండేలా ఈ ఫీచర్ ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది. ముందస్తు బుకింగ్ చేసుకొనేందుకు అందుబాటులో ఉంది. అక్టోబర్ 23 నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఐప్యాడ్ మిని 128GB, 256GB స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఐప్యాడ్ మిని (W-Fi) వేరియంట్ ధర రూ.49,900 గా ఉంది. అదే వైఫై+ సెల్యూలర్ మోడల్ ధర రూ.64,900 గా ఉంది. విద్యార్థులకు ప్రత్యేక డిస్కౌంట్‌ను అందించనుంది. ఐప్యాడ్ మిని బ్లూ, పర్పుల్, స్టార్‌లైట్, స్పేస్ గ్రే రంగుల్లో లభిస్తుంది.
0 Comments