Ad Code

అచేతనంగా పుట్టిన శిశువుకు ప్రాణం పోసిన వైద్యుడు : సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌ !


ప్రాణాలు పోయే స్థితిలో ఉన్న వారికి కూడా ప్రాణం పోసే శక్తి ఒక్క డాక్టర్‌కు మాత్రమే ఉంటుంది. దీనికి సాక్ష్యంగా నిలుస్తూ ఇప్పటి వరకు ఎన్నో సంఘటనలు జరిగాయి. తాజాగా ఇలాంటి ఓ ఘటనే నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు డాక్టర్‌కు హ్యాట్సాప్‌ చెబుతున్నారు. ఓ బిడ్డ అచేతనంగా జన్మించింది. ఆ చిన్నారిలో కొంచెం కూడా కదలికలేదు. దీంతో చనిపోయిన బిడ్డ పుట్టిందని అంతా బాధపడుతున్నారు. అయితే డాక్టర్‌ ఎలాగైనా ఆ బిడ్డను బతికించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా శిశువును మరో గదికి పరుగు పరుగున తీసుకొచ్చారు. అనంతరం శిశువుకు కృత్రిమ శ్వాస అందించేందుకు నోటిపై పరికరం పెట్టి శ్వాస అందించాడు. అలాగే ఛాతిపై మెల్లగా ఒత్తుతూ శిశువు తనంతట తానుగా శ్వాసతీసుకునేలా ప్రయత్నం చేశారు. కాసేపు స్పందించని శిశువు, ఆ తర్వాత క్రమంగా శ్వాస తీసుకోవడం మొదలు పెట్టింది. ఆ తర్వాత వెంటనే శిశువు ఏడుపు ప్రారంభించింది. దీంతో అక్కడున్న వారంతా హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. దీనంతటినీ అక్కడే ఉన్న వారు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు డాక్టర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆ డాక్టర్‌ దేవుడి రూపంలో వచ్చాడంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. దేవుడు ఎక్కడో లేడని ఇలాంటి వైద్యుల రూపంలో ఉన్నారని అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇప్పటి వరకు ఈ వీడియోకు ఏకంగా 14 లక్షల వ్యూస్‌ రావడం విశేషం. 

Post a Comment

0 Comments

Close Menu