Ad Code

మలబద్దకం - జీలకర్ర, రాళ్ల ఉప్పు కలిపిన మజ్జిగ !


నేటి బిజీ లైఫ్ స్టైల్ మరియు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో చాలా మంది మలబద్ధకంతో బాధపడుతున్నారు. మలబద్ధకం సమస్య ఉంటే ఫ్రీ మోషన్ జరగదు. ఈ సమస్యతో బాధపడేవారు, వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే మలవిసర్జన చేస్తారు, మల విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పిని అనుభవిస్తారు. రోజువారీ ఆహారంలో కొన్ని రకాల ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకుంటే ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. మలబద్ధకం కొంతమందికి దీర్ఘకాలిక సమస్య. మలబద్ధకంతో బాధపడే వారికి మజ్జిగ సూపర్ ఫుడ్ అంటున్నారు నిపుణులు. మజ్జిగలో కొన్ని పదార్థాలను కలుపుకుని తాగడం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. వీటిలోని ఆయుర్వేద గుణాలు పొట్ట సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. దీర్ఘకాలిక మలబద్ధకం శరీరంలో అనేక ఇతర సమస్యలను కలిగిస్తుంది. మలబద్ధకం సమస్య క్రమంగా పైల్స్‌కు దారి తీస్తుంది. దీన్ని నివారించాలంటే ఆహారంలో మజ్జిగను చేర్చుకోవడం మంచిది. మజ్జిగను మాత్రమే తీసుకోకుండా, అందులో జీలకర్ర, రాళ్ల ఉప్పు కలపాలి. దీన్ని తాగడం వల్ల మలబద్ధకం దూరమవుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మనం తీసుకునే ఆహారంలో చేసే పొరపాట్ల వల్ల మలబద్ధకం సమస్యలు తరచుగా వస్తాయి. జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ వంటి ఆహారాలు తినడం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం అధికం. బర్గర్లు, పిజ్జా తిన్న మరుసటి రోజే చాలా మంది మలబద్ధకం సమస్యను ఎదుర్కొంటారని నిపుణులు చెబుతున్నారు. మలబద్ధకానికి మరో కారణం పండ్లు, కూరగాయలు,తృణధాన్యాలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినకపోవడం. మజ్జిగ మలబద్దకానికి చాలా మంచిది, మజ్జిగలో జీలకర్ర, రాళ్ల ఉప్పు మరియు కొత్తిమీర ఆకులు కలిపి తాగడం వల్ల ఈ సమస్యకు మరింత ఎఫెక్టివ్ గా పని చేస్తుంది. మజ్జిగలో జీలకర్ర, రాళ్ల ఉప్పు కలిపి తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు మన ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. మలబద్ధకం సమస్యను అధిగమించడానికి, ఆహారంలో కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు ఎక్కువగా చేర్చుకోవాలి. మజ్జిగలో ప్రోబయోటిక్స్ ఉంటాయి, ఇవి కడుపులో బ్యాక్టీరియా సమతుల్యతను కాపాడి కడుపుని చల్లబరుస్తుంది. పేగును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. జీలకర్రలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు గ్యాస్ మరియు ఎసిడిటీ నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఇది జీర్ణ ఎంజైమ్‌లను నియంత్రిస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu