Ad Code

వైన్‌, బీర్‌ రెండూ కలిపి తాగితే ?


వైన్‌, బీర్‌ ఇలా రెండింటిని కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మరింత ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. రెండు వేరు వేరు స్వభావాలు కలిగిన డ్రింక్స్‌ను తీసుకోవడం వల్ల ఇబ్బందులు మరింత ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. ముఖ్యంగా మనిషి మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతాయని అంటున్నారు. రెండింటిని కలిపి తీసుకుంటే మనిషి త్వరగా మత్తులోకి జారుకుంటారని అంటున్నారు. చివరికి ఆలోచించే విచక్షణను సైతం కోల్పోతారు. ఇక బీర్‌, వైన్‌ లేదా విస్కీ కలిపి తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్‌ సమస్య పెరుగుతుంది. ముఖ్యంగా రాత్రుళ్లు తాగి పడుకుంటే ఉదయంసరికి శరీరంలో ఎన్నో ఇబ్బందులకు దారి తీస్తుంది. ముఖ్యంగా డీహైడ్రేషన్ కారణంగా మెదడుపనితీరుపై ప్రభావం పడుతుంది. శరీరంలోకి ఆల్కహాల్‌ ప్రవేశించిన వెంటనే శరీరంలో ఉన్న నీటిని బయటకు పంపిచేస్తుంది. విస్కీ, బీర్‌ కలిపి తీసుకుంటే వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. జీర్ణ సంబంధిత సమస్యలకు ఇది దారి తీస్తుంది అంటున్నారు. ఇక ఈ కారణంగా ఛాతీలో మంట ఎక్కువుతుందని అంటున్నారు. కడుపులో, ఛాతి మంటకు ఇది దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీల పనితీరుపై కూడా బీర్‌, విస్కీ కలిపితీసుకోవడం తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు.

Post a Comment

0 Comments

Close Menu