Ad Code

అధికారిక నివాసాన్ని ఖాళీ చేయనున్న కేజ్రీవాల్


ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ అధికారిక నివాసాన్ని రేపు  ఖాళీ చేయనున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో జైలుకెళ్లి, అనంతరం ఆరు నెలల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఊహించని రీతిలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అతిషిని ఆ సీటులో కూర్చోబెట్టారు. సెప్టెంబర్ 21న అతిషి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే కేజ్రీవాల్ వెంటనే అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. అయితే హర్యానా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. గురువారం ఎన్నికల ప్రచారం ముగిసింది. దీంతో ఆయనకు సమయం దొరకడంతో శుక్రవారం నివాసాన్ని ఖాళీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఓ పార్టీకి అధినేతగా ఉన్న కేజ్రీవాల్‌కు అధికారిక నివాసాన్ని కేటాయించాలంటూ కేంద్రానికి ఆమ్ ఆద్మీ పార్టీ లేఖ రాసింది. కానీ కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో ఆ పార్టీ ఎంపీ అశోక్ మిట్టల్ ఇంట్లో ఉండాలని నిర్ణయించుకున్నారు. అశోక్ మిట్టల్ ఇల్లు న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది. ఇది కేజ్రీవాల్‌కు వివిధ పనులు నిర్వహణకు అనువుగా ఉంటుందని భావిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu