గూగుల్ సొంత చాట్‌లో కొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్ ప్రవేశపెట్టింది. గూగుల్ చాట్ ద్వారా వినియోగదారులను సులభంగా వీడియో మెసేజ్‌లను పంపుకోవచ్చు. ఈ కొత్త అప్‌డేట్ వినియోగదారుల మధ్య కమ్యూనికేషన్‌ను మరింత సులభతరం చేస్తుంది. మీరు సేల్స్ టీమ్‌లో భాగమైనా, కంపెనీలో ఎగ్జిక్యూటివ్ అయినా లేదా ప్రాజెక్ట్ గురించి షేర్ చేసే టీమ్ మెంబర్ అయినా ఈ ఫీచర్ మీ సమయాన్ని మరింత ఆదా చేస్తుంది. గూగుల్ చాట్‌ని ఓపెన్ చేసి సాధారణ మెసేజ్‌లా టైప్ చేసే కంపోజ్ బాక్స్‌పై క్లిక్ చేయండి. రికార్డ్ బటన్ ఎంచుకుని "Video Message" ఎంచుకోండి. మీ మెసేజ్ రికార్డ్ చేయండి. ఆపై ప్రివ్యూ చేయవచ్చు లేదా అవసరమైతే మళ్లీ రికార్డ్ చేయవచ్చు. మీ వీడియో బాగానే ఉందంటే వెంటనే Send బటన్‌పై ట్యాప్ చేయండి. ఈ వీడియో మెసేజ్‌లను డైరెక్ట్ మెసేజ్‌లు, గ్రూప్ చాట్‌లు, స్పేస్‌లలో కూడా షేర్ చేయవచ్చు. మీరు టెక్స్ట్ మెసేజ్‌ల మాదిరిగానే ఇతర యూజర్లతో ఇంటరాక్ట్ అవ్వవచ్చు. కోట్ చేయడం, రియాక్ట్ లేదా థ్రెడ్‌లో రిప్లయ్ ఇవ్వడం చేయొచ్చు. ప్రస్తుతానికి, మీరు వెబ్‌లో మాత్రమే వీడియో మెసేజ్‌లను రికార్డ్ చేయవచ్చు. అలాగే ఇతరులకు పంపవచ్చు. కానీ, మొబైల్ యూజర్లు వాటిని స్వీకరించగలరు. చూడగలరు. భవిష్యత్తులో మొబైల్ ఫోన్లకు ఈ ఫీచర్లను విస్తరించాలని గూగుల్ యోచిస్తోంది.
0 Comments