ఆధార్ కార్డును వినియోగించి కూడా ఏటీఎమ్ ల నుంచి నగదు విత్‌డ్రా చేయవచ్చు. ఇందుకోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆధార్ ఆధారిత పేమెంట్ వ్యవస్థలో బయోమెట్రిక్ అథెంటికేషన్, ఆధార్ కార్డు నంబర్ ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించవచ్చు. బ్యాంకింగ్ ఏజెంట్లు, మైక్రో ఏటీఎంల వద్ద ఈ తరహా లావాదీవీలు నిర్వహించవచ్చు. నగదు బదిలీ, నగదు విత్‌డ్రా, బ్యాలెన్స్ తనిఖీ చేసుకోవచ్చు. ఇందుకోసం బ్యాంకు అకౌంట్‌కు ఆధార్ లింక్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నంబర్ ద్వారా నగదు విత్‌డ్రా చేసుకొనేందుకు ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ఉన్న బ్యాంకింగ్ ఏజెంట్ లేదా మైక్రో ఏటీఎమ్ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. మైక్రో ఏటీఎమ్ వద్దకు వెళ్లి అక్కడ 12 అంకెల ఆధార్ కార్డు నంబర్‌ను నమోదు చేయాలి. అనంతరం బయోమెట్రిక్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఆ తర్వాత అనేక ఆప్షన్‌లు కనిపిస్తాయి. ఆ ఆప్షన్‌లో నుంచి క్యాష్ విత్‌డ్రాను ఎంచుకోవాలి. ఎంత నగదును విత్‌డ్రా చేయాలని భావిస్తున్నారో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నంబర్ లింక్ చేసి ఉన్న బ్యాంక్ అకౌంట్ నుంచి నగదు డెబిట్ అవుతాయి. అనంతరం అక్కడున్న బ్యాంకింగ్ ఏజెంట్ ఆ నగదును మీకు అందిస్తారు. ఇందుకు సంబంధించిన ఎస్ఎంఎస్ కూడా రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్‌కు వస్తుంది. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ను కలిగి ఉన్న బ్యాంకులు నగదు విత్‌డ్రా పై పరిమితిలు విధిస్తాయి. సాధారణంగా ఈ పరిమితి రూ.10,000 నుంచి రూ.50,000 వరకు ఉంటుంది. అయితే కొన్ని బ్యాంకులు ఈ ఆధార్ ఆధారిత పేమెంట్ వ్యవస్థ ద్వారా సేవలు అందించవు. భద్రతాపరమైన నిర్ణయాలు సహా ఇతర కారణాలతో సేవలు అందించడం లేదు. ఈ తరహా వ్యవస్థలు గ్రామీణ ప్రాంతాలు సహా బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అందుబాటులో ఉంటాయి. టెక్నాలజీపైన పూర్తిగా అవగాహన లేని వినియోగదారులు కూడా బయోమెట్రిక్ ద్వారా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ తరహా వ్యవస్థ ద్వారా ఏటీఎమ్ లపై భారం తగ్గుతుంది. భారత్‌లో అనేక జాతీయ బ్యాంకులు ఈ వ్యవస్థ ద్వారా సేవలు అందిస్తున్నాయి.
0 Comments