శాంసంగ్ త్వరలో గెలాక్సీ A16 5G, గెలాక్సీ A16 4G స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయనుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ A15 5G మరియు 4G మోడళ్లకు తర్వాత తరం వెర్షన్ గా లాంచ్ కానున్నాయి. ఇటీవల ఈ గెలాక్సీ A16 5G, గెలాక్సీ A16 4G వేరియంట్‌ల డిజైన్ సహా ఇతర వివరాలు లీక్ అయ్యాయి. అయితే తాజాగా ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన కీలక వివరాలు వెల్లడయ్యాయి. తాజా లీక్‌ల ఆధారంగా శాంసంగ్ గెలాక్సీ A16 5G స్మార్ట్‌ఫోన్ 90Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల FHD+ (2340x 1080 పిక్సల్స్) సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ Exynos 1330 SoC చిప్‌సెట్ తో పనిచేస్తుంది. మైక్రో SD కార్డు ద్వారా 1.5TB వరకు స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంది. గెలాక్సీ A16 4G స్మార్ట్‌ఫోన్ 90Hz రీఫ్రెష్ రేట్‌తో కూడిన 6.7 అంగుళాల FHD+ (2340*1080 పిక్సల్స్) సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో G99 చిప్‌సెట్ పైన పనిచేస్తుందని సమాచారం. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకొనేందుకు వీలుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఒకే తరహా ఆండ్రాయిడ్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంటాయని సమాచారం. మరియు 4G, 5G మోడళ్లు 4GB ర్యామ్, 128GB స్టోరేజీని కలిగి ఉంటాయని తెలుస్తోంది. ఒకే రకమైన కెమెరాలను కలిగి ఉంటాయని సమాచారం. 50MPప్రధాన కెమెరా, 5MP అల్ట్రావైడ్, 2MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం. మరియు 13MP సెల్ఫీ కెమెరాతో విడుదల కానుందని తెలుస్తోంది. దీంతోపాటు శాంసంగ్ గెలాక్సీ A16 5G, గెలాక్సీ A16 4G వేరియంట్‌లు 25W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది. కనెక్టివిటీ పరంగా రెండు వేరియంట్‌లు డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.3, USB-C ఛార్జింగ్ పోర్టు, GPS ఫీచర్‌లను కలిగి ఉంటుంది. అదే గెలాక్సీ A16 5G స్మార్ట్‌ఫోన్ NFC సహా భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుందని సమాచారం. మరియు IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.
0 Comments