కృష్ణా నదికి ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు ప్రకాశం బ్యారేజీ 70 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం 1.18 లక్షల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. భారీ మొత్తంలో నీటి ప్రవాహం ఉండటంతో నదీ పరివాహకప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. శ్రీశైలం జలాశయానికి కూడా భారీ మొత్తంలో వరద వచ్చి చేరుతోంది. 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం స్పిల్‌వే ద్వారా 1.67 లక్షల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. ఎగువ నుంచి శ్రీశైలానికి 2.17 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. కుడి, ఎడమ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేసి 60 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
0 Comments