దేశీయ మార్కెట్లో రియల్‌మీ జీటీ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను అతి త్వరలో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇటీవలే ఈ స్మార్ట్‌ఫోన్ చైనాలోని 3C సర్టిఫికేషన్ ప్లాట్‌ఫారమ్‌లో లిస్ట్ అయింది. ఇది రియల్‌మీ జీటీ 7 ప్రో మోడల్ నంబర్ RMX5010తో మార్కెట్‌లోకి వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే.. ఇందులో ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో కూడిన మూడు సెన్సార్లు ఉన్న క్వాడ్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది. దీని కుడి అంచుల్లో పవర్ కీ, వాల్యూమ్ కీలను అందించనున్నట్లు లీకులను బట్టి తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ మైక్రో-క్వాడ్-కర్వ్డ్ డిజైన్‌తో కూడిన 6.78 అంగుళాల BOE X2 LTPO OLED డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డిస్‌ప్లే 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లేను రాబోయే వన్‌ప్లస్ 13 సిరీస్‌లోనూ ఉపయోగించే అవకాశం ఉంది. ఇక, ఈ స్మార్ట్‌ఫోన్ 8.5 మిమీ మందంతో ఉంటుందని టిప్‌స్టర్స్ పేర్కొన్నారు. ప్రాసెసర్ విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ 16 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్‌తో కూడిన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్4 ఎస్‌ఓసీపై పనిచేస్తుంది. ఇది రియల్‌మీ యూఐ 6 ఆధారిత ఆండ్రాయిడ్ 15 పై రన్ అవుతుంది. రియల్‌మీ జీటీ 7 ప్రో ఫోన్‌లో 6,000mAh బ్యాటరీ ఉంటుంది. కొద్దిసేపు ఛార్జింగ్‌కే రోజంతా పనిచేస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే.. దీనిలో 50 ఎంపీ OIS ప్రైమరీ సెన్సార్ కెమెరాను అందించనుంది. దీని ద్వారా అల్ట్రా-వైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్, 10x హైబ్రిడ్ జూమ్, 120x వరకు 50MP LYT-600 పెరిస్కోప్ టెలిఫోటో, డిజిటల్ జూమ్ ఫోటోలను తీయవచ్చు. ఇందులో 32MP సెల్ఫీ కెమెరాను సైతం అందించనుంది. ఇది అల్ట్రాసోనిక్ ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్లను కలిగి ఉంటుంది. మరోవైపు, ఈ స్మార్ట్‌ఫోన్ IP68, IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టంట్ రేటింగ్‌తో వస్తుంది.
0 Comments