Ad Code

1.7 కోట్ల సిమ్‌ కార్డులను బ్లాక్‌ చేసిన కేంద్ర ప్రభుత్వం !


1.7 కోట్ల సిమ్ కార్డులను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. నకిలీ ఆధార్ కార్డులు, ఇతర పత్రాల ద్వారా ఈ సిమ్ కార్డులు జారీ అయ్యాయని, నకిలీ పత్రాలు ఇచ్చి జారీ చేసిన సిమ్ కార్డులను బ్లాక్‌ చేసింది. సైబర్‌ మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోంది. స్పామ్ కాల్‌లను ఆపడానికి ప్రభుత్వం ఇటువంటి నకిలీ సిమ్ కార్డులను బ్లాక్‌ చేస్తోంది. నకిలీ పత్రాలతో కొనుగోలు చేసిన 1.77 కోట్ల మొబైల్ కనెక్షన్‌లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో బ్లాక్ చేసింది కేంద్రం. అదనంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ తో కలిసి పనిచేస్తున్న నలుగురు టెలికాం సర్వీస్ ఆపరేటర్లు 45 లక్షల నకిలీ అంతర్జాతీయ కాల్‌లను టెలికాం నెట్‌వర్క్‌కు చేరకుండా నిరోధించారు. దాదాపు 11 లక్షల ఖాతాలను బ్యాంకులు, పేమెంట్ వాలెట్లు స్తంభింపజేసినట్లు కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రానున్న రోజుల్లో సిమ్ కార్డులు బ్లాక్ అవుతాయని ప్రభుత్వం చెబుతోంది.


Post a Comment

0 Comments

Close Menu