క్టోబర్ 12న ఒప్పో కే12 ప్లస్ ను చైనాలో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. త్వరలో రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుత కే12 సిరీస్ లో చేరనుంది. ఈ కే12 సిరీస్ ఈ సంవత్సరం ఏప్రిల్‌లో లాంచ్ చేయబడింది. ఒప్పో కే12 ప్లస్ బసాల్ట్ బ్లాక్ మరియు స్నో పీక్ వైట్ కలర్ ఆప్షన్‌లలో వస్తుందని నిర్ధారించబడింది. ఈ ఫీచర్ల పరంగా, ఈ హ్యాండ్‌సెట్ 6.7-అంగుళాల పూర్తి HD+ అమోలెడ్ స్క్రీన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఇది స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. సాధారణ Oppo K12 లోని అదే ప్రాసెసర్ తో వస్తుంది. 50MP ప్రధాన కెమెరా మరియు 16MP సెల్ఫీ కెమెరాతో కూడా వస్తుంది. 5500 mAh బ్యాటరీ కాకుండా 6400mAh బ్యాటరీని ప్యాక్ చేసినట్లు నిర్ధారించబడింది. 100W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌కు బదులుగా 80W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. అంతేకాకుండా, K12 ప్లస్ ఫోన్ సాఫ్ట్‌వేర్ ముందు Android 14-ఆధారిత ColorOS 14 ని కలిగి వుంటుంది.