ఆపిల్ ఐ-ఫోన్‌లు, ఇతర ఉత్పత్తుల యూజర్లను కేంద్రం హెచ్చరించింది. వాటితో హై రిస్క్ ముప్పు ఉందని, అప్రమత్తంగా ఉండాలని ఆపిల్ ఉత్పత్తుల యూజర్లను కేంద్ర ప్రభుత్వ అనుబంధ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్-ఇన్) అలర్ట్ జారీ చేసింది. పలు ఆపిల్ ఉత్పత్తుల్లో పలు భద్రతా పరమైన లోపాలు ఉన్నాయని, దీంతో హై రిస్క్ ముప్పు పొంచి ఉందని పేర్కొంటూ సెర్ట్ -ఇన్ ఈ నెల 19న అడ్వైజరీ జారీ చేసింది. ఐఓఎస్, ఐపాడ్ ఓఎస్, మాక్ ఓఎస్, వాచ్ ఓఎస్, విజన్ ఓఎస్ వర్షన్లలో లోపాలు ఉన్నాయని తెలిపింది. కనుక ఆపిల్ ఉత్పత్తుల యూజర్లు ముప్పును తప్పించుకునేందుకు తాజా ఓఎస్ వర్షన్లతో అప్ డేట్ చేసుకోవాలని సెర్ట్-ఇన్ సూచించింది. తమ డివైజ్ లపై అన్ యూజువల్ యాక్టివిటీని పర్యవేక్షించాలని పేర్కొంది.
0 Comments