Ad Code

భారత్‌లో లెనోవో ఏఐ సర్వర్ల తయారీ !


వచ్చే ఏడాది నుంచి లెనోవో భారత్‌లోని పుదుచ్చేరి ప్లాంటులో ఏఐ సర్వర్ల తయారీ చేపట్టనుంది.  ఏటా 50,000 యూనిట్ల ఎంటర్‌ప్రైస్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సర్వర్స్, 2,400 యూనిట్ల హై ఎండ్‌ గ్రాఫిక్స్‌ ప్రాసెసింగ్‌ యూనిట్స్‌ (జీపీయూ) తయారు చేయనున్నట్టు లెనోవో ఇండియా ఎండీ శేలేంద్ర కటియాల్‌ తెలిపారు. వీటిలో 60 శాతంపైగా ఆసియా పసిఫిక్‌ ప్రాంతానికి ఎగుమతి చేస్తారు. అలాగే సంస్థకు నాల్గవ అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని బెంగళూరులో నెలకొల్పింది. భవిష్యత్తులో అన్ని ప్రధాన సర్వర్‌ డిజైన్, డెవలప్‌మెంట్స్, కొత్త సాంకేతిక కార్యక్రమాలను ఈ ల్యాబ్‌లో నిర్వహిస్తామని కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఇటువంటి సెంటర్స్‌ ప్రపంచవ్యాప్తంగా సంస్థకు 18 ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu