తెలంగాణ ప్రభుత్వంతో రెండేళ్ల కాలానికి ఒప్పందం కుదిరినట్లు మెటా అధికారిక ప్రకటన చేసింది. ఒప్పందంలో భాగంగా మెటా తెలంగాణ ప్రభుత్వ ఇ-గవర్నెన్స్ పోర్టల్స్, ప్రభుత్వ శాఖల ఉత్పాదకత మరియు సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు వీలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను అందించనుంది. వినూత్న ఆవిష్కరణకు వీలుగా టెక్నాలజీని కూడా అందిస్తుంది. తెలంగాణ ప్రభుత్వ ఇ-గవర్నెర్స్ మెకానిజమ్, పబ్లిక్ సర్వీస్ డెలివరీ సహా ప్రభుత్వ ఏజెన్సీలు, శాఖల ఉత్పాదకత, సామర్థ్యాలను పెంచేందుకు వీలుగా జెనరేటివ్ AI ను వినియోగించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను ఏ స్థాయిలో వినియోగిస్తారనే సమాచారం వెల్లడించలేదు. ఈ తరహా భాగస్వామ్యాలు తమ AI విధానాల్లో భాగమని మెటా వెల్లడించింది. దీంతోపాటు సంస్థ మరిన్ని వివరాలను వెల్లడించింది. జనరేటివ్ AI ద్వారా రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక అవకాశాలను పెంపొందించడంలో సాయపడాలని భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడళ్లు సేవలు, డాక్యుమెంట్ రివ్యూ, కంప్యూటర్ కోడ్ జనరేషన్‌లో ఉపయోగించవచ్చని తెలిపింది. సంస్థలు. ప్రభుత్వాలతోపాటు తన సొంత సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలలోనూ వీటిని ఉపయోగిస్తోంది. త్వరలో వాట్సాప్‌లో మెటా AI వాయిస్ ఫీచర్‌ను త్వరలో లాంచ్ చేయనుందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొనే అనేక సవాళ్లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పరిష్కారాలు లభిస్తాయని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో గ్లోబల్ హబ్‌గా నిలపడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఏఐ అభివృద్ధితో మరింత ముందుకెళ్లేందుకు వీలుగా కచ్చితమైన ప్లానింగ్‌ను రూపొందించుకుంటోంది.
0 Comments