Ad Code

మధుమేహం - ఆపిల్ పండు


పిల్ లో విటమిన్ సి, ఫైబర్, పొటాషియంతో సహా అనేక పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. రోజుకో ఆపిల్ తింటే క్యాన్సర్, అధిక రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. ఆపిల్ అనేక వ్యాధులతో పోరాడుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. ఆరోగ్యవంతమైన వ్యక్తి ఆపిల్ ను క్రమం తప్పకుండా తీసుకుంటే, అతని ఆరోగ్యం క్షీణించే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. ఆపిల్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు, ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ఆపిల్‌లో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు మంచిదని భావిస్తారు. కానీ జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నట్లయితే దీనిని ఎప్పుడూ తినకూడదు. దీన్ని తీసుకోవడం వల్ల గ్యాస్, కడుపునొప్పి, తిమ్మిర్లు వంటివి వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యులను సంప్రదించడం మంచిది. మధుమేహం పేషెంట్లు యాపిల్ తినకూడదు. ఇది అధిక మొత్తంలో చక్కెరను కలిగి ఉంటుంది. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయి గణనీయంగా పెరుగుతుంది. ఆపిల్ పండ్ల వినియోగం ఊబకాయాన్ని పెంచుతుంది. ఎందుకంటే ఇందులో చాలా కేలరీలు, చక్కెర ఉంటాయి. కొంతమందికి ఆపిల్ తినడం వల్ల కూడా అలర్జీ రావచ్చు. అటువంటి పరిస్థితిలో, ఆపిల్ తిన్న తర్వాత చర్మంపై దురద, దద్దుర్లు లేదా వాపులు కనిపిస్తే, దాని వినియోగాన్ని వెంటనే నిలిపివేయాలి.

Post a Comment

0 Comments

Close Menu