Ad Code

కావడి విధానం కొంతమేరకు ఫలితాన్నిచ్చింది !


విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌ వద్ద నీట మునిగిన బోటును కావడి బోట్లు పైకి లేపి నెమ్మదిగా ముందుకు కదిలిస్తోంది. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద నీటిలో మునిగిన బోటును ఒడ్డుకు చేర్చడానికి ఇంజనీరింగ్‌ నిపుణులు అమలు చేస్తున్న కావడి విధానం కొంతమేరకు ఫలితాన్నిచ్చింది. సోమవారం మధ్యాహ్నం నుంచి ఈ ప్లాన్‌ను అమలు చేశారు. దుర్గాఘాట్‌కు అవతలి వైపు ఇనుప గడ్డర్లు అమర్చిన రెండు బోట్లను బ్యారేజ్‌ వద్దకు తీసుకొచ్చారు. నీటిలో మునిగిన బోటుకు చెరో పక్కన ఈ బోట్లను నిలిపారు. తర్వాత సీ లయన్‌ కంపెనీ డైవర్లు మునిగి ఉన్న బోటుకు రెండు వైపులా ఎనిమిది రోప్‌లు బిగించారు. వాటిని కావడి బోట్లపై ఉన్న ఇనుప గడ్డర్లకు లాక్‌ చేశారు. అనంతరం ఈ బోట్ల బరువును పెంచడానికి నదిలోని నీటిని లోడ్‌ చేశారు. దీంతో ఈ రెండు బోట్లు కాస్త నీటిలోకి దిగాయి. తర్వాత ఈ బోట్లలో ఉన్న నీటిని మొత్తం మోటార్ల ద్వారా తోడేశారు. అప్పుడు బోట్లు పైకి లేచాయి. అదే సమయంలో వాటితోపాటు నీటిలో మునిగిన బోటు ఒక భాగం కూడా పైకి లేచింది. తర్వాత రెండు బోట్లను నెమ్మదిగా ముందు కదిలించారు. ఈ క్రమంలో నీట మునిగిన బోటు కాస్త ముందుకు వచ్చింది. ఈలోగా చీకటి పడడంతో ఆపరేషన్‌ను నిలుపుదల చేశారు. మంగళవారం ఉదయం నుంచి మళ్లీ బోటును లాగడం ప్రారంభిస్తారు. మునిగిన బోటు ఒడ్డుకు చేర్చడానికి మరో రోజు పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. బోటు ఆపరేషన్‌ పనులు చేయిస్తున్న కాకినాడకు చెందిన పెంటపాటి అబ్బులు ఫోన్‌ సోమవారం దొరికింది. మోడల్‌ గెస్ట్‌హౌ్‌సలో స్వీపర్లు సోమవారం క్లీనింగ్‌ చేస్తుండగా చెత్తబుట్టలో ఫోన్‌ ఉన్నట్టు గుర్తించారు. ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశారు. అధికారులు ఈ ఫోన్‌ను అబ్బులుకు అందజేశారు.

Post a Comment

0 Comments

Close Menu