ఆండ్రాయిడ్ యూజర్ల కోసం డిఫాల్ట్ చాట్ థీమ్ ఫీచర్ ను విడుదల చేయనున్నట్లు వాబీటాఇన్ఫో తెలిపింది. వాట్సాప్ లో రానున్న రోజుల్లో వచ్చే కొత్త అప్డేట్ ద్వారా ఈ ఫీచర్ అందుతుందని తెలిపింది. వాబీటాఇన్ఫో తన X అకౌంట్ నుంచి ఈ కొత్త అప్డేట్ ను స్క్రీన్ షాట్ తో సహా అందించింది. ఈ ట్వీట్ ప్రకారం, వాట్సాప్ త్వరలో కొత్త డీఫాల్ట్ చాట్ థీమ్ ఫీచర్ ను ఆండ్రాయిడ్ యూజర్ల కోసం తీసుకు వస్తోంది. ఈ డీఫాల్ట్ చాట్ థీమ్ ఫీచర్ ఇప్పటికే బీట్ టెస్టర్స్ కోసం ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా 2.24.2012 అప్డేట్ ను గూగుల్ ప్లే స్టోర్ లో అందించింది. ఈ ఫీచర్ తో చాలా రకాలైన స్టైల్స్ లో నచ్చిన థీమ్ ను ఎంచుకునే అవకాశం వుంది. వాబీటాఇన్ఫో అందించిన స్క్రీన్ షాట్ ప్రకారం, ఈ అప్ కమింగ్ వాట్సాప్ ఫీచర్ తో చాట్ థీమ్ లో మల్టీ కలర్ మరియు వైడ్ రేంజ్ ఆప్షన్ లు యూజర్లు అందుబాటులోకి వస్తాయి. అంతేకాదు, ఇందులో థీమ్ బ్రైట్నెస్ ను కూడా సరి చేసుకునే అవకాశం కూడా ఇందులో అందించింది. ఈ కొత్త మల్టీ కలర్ చాట్ థీమ్ ను ఎంసీ ఎన్ ఎంచుకున్న యూజర్లకు వాల్ పేపర్ మరియు చాట్ బబుల్ కలర్ కూడా ఆటోమాటిగ్గా గా మారిపోతుంది. అంటే, వాల్ పేపర్ ను బట్టి చాట్ బబుల్ కలర్ ఆటోమాటిగ్గా అడ్జెస్ట్ అవుతుంది మరియు కొత్త కలర్ లో కనిపిస్తుంది. అంతేకాదు, యాప్ సెట్టింగ్ ద్వారా యూజర్లు థీమ్ కస్టమైజేషన్ ఆప్షన్ ను ఉపయోగించి చాట్ థీమ్ ను యూజర్ కు నచ్చిన విధంగా కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు.
0 Comments