బీహార్ లో ఓ డాక్టర్ యూట్యూబ్ చూస్తూ సర్జరీ చేయడంతో నిండు ప్రాణం బలయింది. అనారోగ్యంగా ఉన్న ఓ బాలుడిని (15) అతడి కుటుంబీకులు సరన్ ప్రాంతంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ అజిత్ అనే వైద్యుడు వారి అనుమతి లేకుండానే బాలుడికి పిత్తాశయ సర్జరీని యూట్యూబ్ లో చూస్తూ చేశాడు. అనంతరం బాలుడు చనిపోవడంతో సిబ్బందితో సహా పరారయ్యాడు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
0 Comments