ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి డేట్ వివరాలు లీక్ అయ్యాయి. సెప్టెంబర్ చివరి వారంలో ఈ సేల్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వార్షిక సేల్ భారత మార్కెట్లో పండుగ సీజన్‌కు ముందు అనేక రకాల ప్రొడక్టులపై ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తుంది. ఈ సేల్ సమయంలో కార్డ్‌లు, ఈఎంఐ లావాదేవీలను ఉపయోగించి చేసిన చెల్లింపులపై అదనపు ఆఫర్‌లను అందించడానికి ఈ-కామర్స్ దిగ్గజం ఈ ఏడాది హెచ్‌డీఎఫ్‌సీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టుగా ఫ్లిప్‌కార్ట్ టీజర్ వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024లో ఆపిల్, శాంసంగ్, గూగుల్ వంటి బ్రాండ్‌లు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ల ధరలను తగ్గించే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్ ఫోన్లతో పాటు, లైఫ్‌స్టైల్, కిరాణా, ఇల్లు, ఫర్నీచర్ ప్రొడక్టులపై డిస్కౌంట్లు లభిస్తాయి. ఫ్లిప్‌కార్ట్ 2024 సేల్ సెప్టెంబర్ 26న ప్లస్ మెంబర్‌ల కోసం ముందుగా ప్రారంభం కానుందని టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. లీకైన బ్యానర్ ప్రకారం.. అధికారిక టీజర్ ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్ అయినప్పటికీ సేల్ తేదీని వెల్లడించలేదు. గత సంవత్సరాల్లో మాదిరిగానే, సెప్టెంబర్ 27న కస్టమర్లందరికీ ఈ సేల్ అందుబాటులోకి రానుంది. బ్యాంక్ కార్డ్ హోల్డర్‌లకు వారి కార్డ్‌లు, ఈఎంఐ ద్వారా చేసిన కొనుగోళ్లపై ఇన్‌స్టంట్ డిస్కౌంట్లను అందించేందుకు ఫ్లిప్‌కార్ట్ హెచ్‌డీఎఫ్‌సీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. బ్యాంక్ ఆధారిత తగ్గింపులతో పాటు, ఫ్లిప్‌కార్ట్ దుకాణదారులు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, యూపీఐ ఆధారిత ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు. ఇంకా, కస్టమర్లు పే లేటర్ సేవలను కూడా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు సూపర్ కాయిన్స్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు.
0 Comments