Ad Code

ఓటీపీ స్కామ్‌లకు ఆర్బీఐ చెక్‌ ?


టిపితో సంబంధం లేకుండానే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరిగే విధంగా కొత్త విధానం అమల్లోకి రానుంది. దీనికి మాస్టర్ కార్డ్ ఇన్నోవేటివ్ ఐడియాతో ముందుకు వచ్చింది. దాదాపు బ్యాంక్ లావాదేవీలన్నీమొబైల్ ద్వారానే జరుగుతున్నాయి. అందుకే సైబర్ క్రైమ్ లో ఓటిపి పేరుతో లక్షల రూపాయలు దోచుకోవడం ఈజీగా మారింది. ఓటిపి లేకుండా ఫింగర్ ప్రింట్ ఆధారంగా మాస్టర్ కార్డు ద్వారా ట్రాన్సాక్షన్స్ జరుపుకోవచ్చు. ఇప్పుడు వస్తున్న దాదాపు అన్ని మొబైల్స్‌లో ఫింగర్ ప్రింట్ ఎనేబుల్ సిస్టం వస్తుంది. పదివేల రూపాయల మొబైల్ ఫోన్ నుంచి కూడా ఈ ఫింగర్ ప్రింట్ సిస్టం అందుబాటులో ఉంది. గతంలో లాగానే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరుగుతున్న సమయంలో ఓటిపి బదులు చివరగా ఫింగర్ ప్రింట్ అప్లై చేస్తే లావాదేవీ అయిపోయినట్లే. ఇది మోస్ట్ సేపెస్ట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ గా మాస్టర్ కార్డు చెబుతున్నారు. ఆర్బీఐ ఈ విధానాన్ని గత వారం నుంచే అమలులోకి తీసుకొచ్చింది. ముందుగా మాస్టర్ కార్డు యూజర్స్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఫింగర్ ప్రింట్ ఆప్షన్ ని ఎనేబుల్ చేసుకోవాలి. ఆ తర్వాత నుంచి ఫింగర్‌ ప్రింట్‌ ఆప్షన్ మొబైల్ స్క్రీన్ పై కనిపిస్తుంది. ఒకవేళ కంప్యూటర్ ద్వారా మనీ ట్రాన్సాక్షన్ చేస్తే అప్పుడు ఓటిపి ఆప్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంది. మాస్టర్ కార్డుతో మొదలైన ఈ ఫింగర్ ప్రింట్ ఆప్షన్ ఇక అన్ని డెబిట్ క్రెడిట్ కార్డులు బ్యాంకులకు అప్లై చేయాలని రిసర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆలోచిస్తుంది. ప్రస్తుతానికి ఇదొక్కటే ఓటిపి స్కాం నుంచి విముక్తి అని ఆర్బీఐ భావిస్తుంది. ఫింగర్‌ ప్రింట్‌ యూనిక్‌గా ఉండడం.. ఫింగర్ ప్రింట్‌ని డూప్లికేట్ చేయడం దాదాపు అసాధ్యం. అందుకే ఇది సురక్షిత మార్గంగా భావిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu