Ad Code

మహిళా వైద్యుల భద్రత మీ బాధ్యత : డీవై చంద్రచూడ్


శ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోల్‌కతా వైద్యురాలి ఘటనపై స్పందించిన తీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మహిళా వైద్యులకు రాత్రి షిఫ్టులు కేటాయించడాన్ని నిరాకరిస్తున్నామని ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ని సీజేఐ విమర్శించారు. వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వానిది అని అన్నారు. కోల్‌కతా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటన తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ తీసుకువచ్చింది. ''మహిళలు పనిచేయని మీరు ఎలా చెప్పగలరు..రాత్రి వేళ్లలో మహిళా వైద్యులకు రాయితీ అక్కర్లేదు..అదే షిఫ్టులో పనిచేయడానికి మహిళలు సిద్ధంగా ఉన్నారు'' అని బెంగాల్ ప్రభుత్వం తరుపున కేసు వాదిస్తున్న కపిల్ సిబల్‌ని ఉద్దేశిస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. ''మిస్టర్ సిబల్ మీరు దీన్ని చూడాలి. దానికి సమాధానం మీరు తప్పనిసరిగా భద్రత ఇవ్వాలి. పశ్చిమ బెంగాల్ నోటిఫికేషన్ సరిచేయాలి. భద్రత కల్పించడం మీ డ్యూటీ. మహిళలు రాత్రి పూట పనిచేయలేరు అని మీరు చెప్పలేరు. పైలట్లు, ఆర్మీ మొదలైనవి రాత్రి కూడా పనిచేస్తున్నాయి. '' అని సీజేఐ అన్నారు. మహిళా వైద్యులు పరిస్థితి రాత్రిపూట పని చేయకపోవడం వారి కెరీర్‌కి విఘాతం కలిగిస్తుందని కోర్టు పేర్కొంది. ఆర్ జీ కర్ మెడికల్ కాలేజ్ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగడంతో, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అలపన్ బంద్యోపాధ్యాయ మహిళా వైద్యుల భద్రతకు భరోసా ఇవ్వడానికి కొత్త చొరవను ప్రకటించారు. అన్ని మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల వద్ద ఉమెన్-ఫ్రెండ్లీ భద్రతా సిబ్బందిని మోహరిస్తామని చెప్పారు. వైద్య కళాశాలలు, ఆసుపత్రుల వద్ద స్థానిక పోలీసులతో నిత్యం రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.రాత్రి విధుల విషయంలో మహిళా వైద్యులు జంటగా పనిచేసే విధంగా షిఫ్ట్‌లు ఏర్పాటు చేయబడతాయని చెప్పారు.

Post a Comment

0 Comments

Close Menu