కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు చీరలు, గాజులు వేసుకోవాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. పీఏసీ కమిటీ చైర్మన్ గా అరికపూడి గాంధీని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఓ మీడియా ప్రతినిధి అరికపూడి గాంధీ బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెబుతున్నాడని, కౌశిక్ రెడ్డితో అడగ్గా.. కౌశిక్ రెడ్డి ఇలా స్పందించాడు. గాంధీ ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్పాలి. రేపు అరికేపూడి గాంధీ ఇంటికి వెళ్లి BRS పార్టీ కండువా కప్పుతా. ప్రతిపక్షంలో ఉన్నా అంటున్నాడు కాబట్టి రేపు అరికేపూడి గాంధీ ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుతా.. ఇద్దరం కలిసి మీ ఇంటి మీద జెండా ఎగరేసి, బీఆర్ఎస్ భవన్ లో ప్రెస్ మీట్ పెడదామన్నారు.
0 Comments