Ad Code

ఆంధ్రప్రదేశ్ లో రానున్న రెండు రోజుల్లో వర్షాలు !


ఆంధ్రప్రదేశ్ లో రానున్న రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వానలు పడతాయని అంచనా వేసింది. నిన్న రాష్ట్రవ్యాప్తంగా ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగాయి. నెల్లూరు జిల్లా కావలి 38.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది ఆగ్నేయ బంగ్లాదేశ్ సమీపంలో కేంద్రీకృతమైందని, క్రమంగా బలపడుతోందని తెలిపింది. రేపటికి వాయుగుండంగా మారనుందని పేర్కొంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందంది. వీటి ప్రభావంతో కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు పడతాయని ప్రకటించింది. కాగా ఇవాళ విశాఖలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. 

Post a Comment

0 Comments

Close Menu