Ad Code

బెండకాయ - అనర్థాలు !


బెండకాయలను చాలా మంది అనేక రకాలుగా వండుకుని తరచూ తింటుంటారు. అయితే బెండకాయలను తినడం వల్ల మనకు అనేక లాభాలు కలిగే మాట వాస్తవమే అయినప్పటికీ కొందరు మాత్రం వీటిని తినకూడదు. అలర్జీల సమస్య ఉన్నవారు బెండకాయలను తినకూడదు. తింటే సమస్య మరింత ఎక్కువవుతుంది. దీంతో చర్మంపై దురదలు, దద్దుర్లు, వాపులు వస్తాయి. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. పొట్టలో నొప్పి కూడా వస్తుంది. అలాగే మలబద్దకం, విరేచనాలు, ఐబీఎస్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా బెండకాయలను తినకూడదు. షుగర్ పేషెంట్లు బెండకాయలను తినే సమయంలో జాగ్రత్త వహించడం మంచిది. ఎందుకంటే వీటిని మరీ అతిగా తింటే షుగర్ లెవల్స్ పడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు బెండకాయలను తినాల్సి ఉంటుంది. పాలిచ్చే తల్లులు, గర్భంతో ఉన్నవారు బెండకాయలను తినకూడదు. డాక్టర్ ను అడిగిన తరువాతే వీటిని తినాల్సి ఉంటుంది. 

Post a Comment

0 Comments

Close Menu