ఉత్తరప్రదేశ్ లోని కస్‌గంజ్ జిల్లాలో సోషల్ మీడియాలో పేరు తెచ్చుకోవడానికి ముకేశ్ కుమార్ అనే యువకుడునడిరోడ్డుపై అచ్చం శవంలా పడుకున్నాడు. అలా శవంలా నడిరోడ్డుపై ఉంచిన అతని స్నేహితులు ఇన్‌స్టాలో రీల్ కోసం దానిని వీడియో తీయడం ప్రారంభించారు. నడిరోడ్డుపై శవంలా పడి ఉండటతో అంతా నిజంగా చనిపోయారనే భావించి విషాదంగా మెుహం పెట్టి నిలుచున్నారు. వీడియో తీయడం ముగిసిన వెంటనే పగలబడి నవ్వుతూ ముకేశ్ ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. దీంతో అప్పటివరకు ఆ యువకుడు చనిపోయాడని భావించిన ఆ జనం ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. మరోవైపు నిజంగానే శవం అనుకుని భావించిన ఆ యువకుడి చుట్టూ ప్రజలు భారీగా గుమ్మికూడారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు కొందరు మిత్రులు వీడియోను వైరల్ చేశారు. దీంతో అది కాస్తా వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అదనపు పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ భారతి స్పందించారు. కోల్డ్ స్టోరేజీ ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని ఓ యువకుడు శవంలా రోడ్డుపై పడుకుని వీడియో తీసినట్లు తెలిపారు. మరోవైపు శవం వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వ్యవహారంతో అక్కడ గందరగోళం నెలకొందని ఏఎస్పీ తెలిపారు. ఈ ఘటనకు కారణమైన ముఖేశ్ కుమార్‌ను అరెస్ట్ చేశామని, అతనిపై తగిన చర్యలు తీసుకుంటామని అదనపు పోలీస్ సూపరింటెండెంట్ రాజేశ్ భారతి వెల్లడించారు.
0 Comments