రేపు టాటా మోటార్స్ మోస్ట్ అవైటెడ్ కర్వ్ ఎస్‌యూవీని విడుదల చేయబోతోంది. ఇంతకు ముందు టాటా కర్వ్వ్ ఎలక్ట్రిక్ వేరియంట్ మార్కెట్లో లాంచ్ చేసింది. టాటా కర్వ్ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వంటి SUVలతో నేరుగా మార్కెట్లో పోటీపడుతుంది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024లో కంపెనీ టాటా కర్వ్‌ను ప్రదర్శించింది. టాటా కర్వ్ డిజైన్ గురించి మాట్లాడినట్లయితే ఇందులో హెడ్‌ల్యాంప్‌లు, సిగ్నేచర్ LED ఐ ల్యాంప్స్, పెద్ద బంపర్, సైడ్ ప్రొఫైల్‌లో పాప్-అవుట్ డోర్ హ్యాండిల్, అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఇది కాకుండా టాటా కర్వ్ లోపలి భాగంలో డ్యూయల్-డిజిటల్ స్క్రీన్ సెటప్, పవర్డ్ డ్రైవర్ సీట్, పవర్డ్ టెయిల్‌గేట్ కూడా చూడొచ్చు.ప్రయాణీకుల భద్రత కోసం SUV 360 డిగ్రీ కెమెరా, లెవల్ 2 ADAS టెక్నాలజీ వంటి ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. కారులో 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 9 స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ కూడా ఉంటాయి. టాటా కర్వ్ 1.2-లీటర్ GDi టర్బో పెట్రోల్ ఇంజన్‌తో అందించబడుతుంది, ఇది గరిష్టంగా 123bhp పవర్, 225Nm గరిష్ట టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. SUV పెట్రోల్ వేరియంట్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్ ఆప్షన్స్ కలిగి ఉంటుంది. ఇది కాకుండా SUV 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 113bhp టాప్ పవర్, 260Nm పీక్ టార్క్‌ను రిలీజ్ చేయగలదు. SUV డీజిల్ వేరియంట్‌లో కస్టమర్‌లు 6 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికను చూస్తారు. టాటా కర్వ్ ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ. 9.35 లక్షలుగా ఉండే అవకాశం ఉంది.
0 Comments