Ad Code

అమేజ్‌ఫిట్‌ జీటీఆర్ 4 న్యూ వాచ్‌ విడుదల


మేజ్‌ఫిట్‌ జీటీఆర్  4 న్యూ వాచ్‌ విడుదలైంది. గత మోడల్‌తో పోలిస్తే అనేక అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంది. సింగిల్‌ ఛార్జింగ్‌తో ఈ వాచ్‌ గరిష్ఠంగా 12 రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఈ వాచ్‌ అనేక హెల్త్‌ ట్రాకర్లను కలిగి ఉంది. ఇన్‌బిల్ట్‌ అలెక్సా వాయిస్‌ అసిస్టెంట్‌తో అందుబాటులోకి వచ్చింది. 1.45 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేతో లాంచ్‌ అయింది. 466X466 పిక్సల్‌ రిజల్యూషన్‌తో 1.45 అంగుళాల వృత్తాకార అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 326 ppi పిక్సల్‌ డెన్సిటీతో విడుదల అయింది. ఈ డిస్‌ప్లే యాంటీ ఫింగర్‌ ప్రింట్‌ కోటింగ్‌, టెంపర్డ్‌ గ్లాస్‌ రక్షణను కలిగి ఉంటుంది. స్టెయిన్‌లెస్ స్టీల్‌ ఫ్రేమ్‌, గ్లాస్‌ సిరామిక్‌ షేల్‌ను కలిగి ఉంటుంది. ఈ వాచ్‌ 5 ATM వాటర్‌ రిసిస్టెంట్‌గా అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌వాచ్‌ మరో ఆసక్తికర ఫీచర్‌ను కలిగి ఉంది. ఇన్‌బిల్ట్‌ అలెక్సా వాయిస్‌ అసిస్టెంట్‌తో విడుదల అయింది. ఈ స్మార్ట్‌వాచ్‌ బ్లూటూత్‌ కాలింగ్‌, మ్యూజిక్ ప్లేబ్యాక్ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. అమేజ్‌ఫిట్‌ స్మార్ట్‌వాచ్‌ 150 స్పోర్ట్స్‌ మోడ్స్‌ మరియు 150 వాచ్‌ ఫేస్‌లను సపోర్టు చేస్తుంది. దీంతోపాటు యూజర్లు ఈ స్మార్ట్‌వాచ్‌లో 2.3GB వరకు పాటలను స్టోర్‌ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్‌ వైఫై, బ్లూటూత్‌ 5.0, GPS కనెక్టివిటీతో అందుబాటులోకి వచ్చింది. బారోమెట్రిక్‌ అల్టిమీటర్‌ సాయంతో యూజర్లు తమ లోకేషన్‌ వివరాలను తెలుసుకోవచ్చు. హార్ట్‌ రేట్‌, SpO2 స్థాయి. ఒత్తిడి స్థాయి. శ్వాసక్రియ రేటును ట్రాక్ చేస్తుంది. దీంతోపాటు రుతుక్రమంపై సమాచారం అందిస్తుంది. దీంతోపాటు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఫీచర్లతో నిద్ర నాణ్యతను పర్యవేక్షిస్తుంది. ఈ అమేజ్‌ఫిట్‌ GTR 4 న్యూ స్మార్ట్‌వాచ్‌ Zepp App ద్వారా పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్‌ 475mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. సింగిల్‌ ఛార్జింగ్‌తో 12 రోజుల వరకు వినియోగించుకోవచ్చు. ఎక్కువుగా వినియోగించే వారికి 8 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ వస్తుందని సంస్థ చెబుతోంది. అయితే GPS మోడ్‌ ఆన్‌లో ఉంటే సింగిల్‌ ఛార్జింగ్‌తో కేవలం 28 గంటల బ్యాటరీ లైఫ్‌ వస్తుందని తెలిపింది. ఇది బ్రౌజ్ లెదర్‌ మరియు గెలాక్సీ బ్లాక్ వంటి రెండు రంగుల్లో లభిస్తుంది. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ ఫినిష్‌తో కూడిన స్ట్రాప్‌లతో అందుబాటులో ఉంది. ఈ వాచ్‌ ధర రూ.16,999 గా ఉంది. 

Post a Comment

0 Comments

Close Menu