రేపు ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ విడుదల కానుంది. its Glowtime పేరుతో నిర్వహిస్తు ఈవెంట్‌లో ఐఫోన్ 16 సిరీస్‌తోపాటు మరిన్ని విడుదల కానున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు విడుదల కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ ఐఫోన్ 16 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ హ్యాండ్‌సెట్‌లు విడుదల కానున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లతోపాటు వాచ్ సిరీస్‌ను కూడా విడుదల చేయనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఐఫోన్ 16 సిరీస్‌కు సంబంధించిన అనేక ముఖ్యమైన వివరాలు లీక్ అయ్యాయి. ఈ లీక్‌ల ఆధారంగా ఐఫోన్ 15 సిరీస్ కంటే ఐఫోన్ 16 సిరీస్ కెమెరా విభాగం మరింత మెరుగైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. స్టాండర్డ్, ప్రో మోడళ్లు కూడా ఈ అప్‌గ్రేడ్‌లను కలిగి ఉండనున్నాయని తెలుస్తోంది. ఈ లీక్‌లు సహా ఇతర నివేదికల ఆధారంగా ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటాయని తెలుస్తోంది. 48MP వైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం. ఈ కెమెరా 1X, 2X జూమింగ్ సామర్థ్యంతో వచ్చే అవకాశం ఉంది. అదే 0.5x జూమింగ్ సామర్థ్యంతో అల్ట్రా వైడ్ లెన్స్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ల కెమెరా విభాగం ఐఫోన్ 11 తరహా డిజైన్‌ను కలిగి ఉంటుంది. అంటే నిలువుగా కెమెరాలు అమర్చబడి ఉన్నాయి. అయితే ఈ కెమెరా విభాగంలో కొన్ని మార్పులు రానున్నాయి. అల్ట్రా వైడ్ లెన్స్ f/2.2 అపేచర్‌తో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఫలితంగా తక్కువ కాంతి ఉన్న సమయాల్లోనూ నాణ్యమైన ఫోటోలను క్యాప్చర్ చేయవచ్చని తెలుస్తోంది. ప్రో మోడళ్లు కెమెరా విభాగం పరంగా మెరుగైన అప్‌గ్రేడ్‌లు పొందనుందని తెలుస్తోంది. అయితే గత సిరీస్ తరహాలోనే కెమెరా మాడ్యుల్ డిజైన్ ఉండనుంది. ప్రో మోడళ్లు ట్రిపుల్ కెమెరాలతో విడుదల కానున్నాయి. వైడ్, అల్ట్రా వైడ్ మరియు టెలిఫోటో లెన్స్‌లతో అందుబాటులోకి రానున్నాయి. 48MP ప్రైమరీ, 12MP టెలిఫోటో కెమెరాతో విడుదల కానుందని తెలుస్తోంది. ఈ ప్రో మోడళ్ల అల్ట్రా వైడ్ కెమెరా 48MP గా ఉంటుందని సమాచారం. ఈ అల్ట్రా వైడ్ కెమెరా అనేక మెరుగైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉండనుంది. ఈ కెమెరా లెన్స్ పిక్సల్ బిన్నింగ్ టెక్నాలజీతో రానుందని తెలుస్తోంది. ఫలితంగా పుల్ రిజల్యూషన్ నుంచి క్వాడ్ పిక్సల్ మోడ్‌కు సులభంగా మారేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు కెమెరా విభాగం కోసం ప్రత్యేకంగా క్యాప్చర్ బటన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ క్యాప్చర్ బటన్ ద్వారా మరింత నాణ్యమైన ఫొటోగ్రఫీ సొంతమవుతుందని తెలుస్తోంది. ఫోకస్, జూమ్ సామర్థ్యాలను మరింత కచ్చితంగా ఉండేలా చూడవచ్చని సమాచారం. అయితే ఐఫోన్ 16 ప్రో మోడళ్ల అల్ట్రా వైడ్ లెన్స్ 5X జూమింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అయితే ఈ స్పెసిఫికేషన్‌ల పై విడుదల సమయంలోనే పూర్తి స్పష్టత రానుంది.
0 Comments