Ad Code

అక్టోబర్‌లో వన్‌ప్లస్‌ 13 స్మార్ట్‌ఫోన్‌ విడుదల !


చైనాలో వన్‌ప్లస్‌ 13  స్మార్ట్‌ఫోన్‌ అక్టోబర్‌లో లాంచ్‌ కానుంది. గతంలో ఈ స్మార్ట్‌ఫోన్‌ చిప్‌సెట్‌ వివరాలు లీక్‌ అయ్యాయి. వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్‌ డిజైన్‌, కలర్‌ వేరియంట్‌ వివరాలు లీక్‌ అయ్యాయి. టిప్‌సెట్‌ సంజు చౌధరీ వన్‌ప్లస్‌ 13 స్మార్ట్‌ఫోన్‌ వివరాలను X ద్వారా షేర్‌ చేశారు. దీని ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది. మరియు గ్రీన్‌ రంగుల్లో వేగాన్‌ లెదర్‌ ఫినిష్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు వెనుకవైపు గ్లాస్‌ డిజైన్‌తో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు కెమెరా మాడ్యూల్‌ వృత్తాకారంగా ఉంది. ఇది ట్రిపుల్‌ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు గత మోడల్‌ తరహాలోనే LED ఫ్లాష్‌ను కూడా కలిగి ఉంది. అయితే భారత్‌లో ఈ హ్యాండ్‌సెట్ ఎప్పుడు విడుదల కానుందో సంస్థ వెల్లడించలేదు. 6.82 అంగుళాల 2K 10 bit LTPO కర్వడ్‌ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. మరియు స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 4 SoC చిప్‌సెట్‌ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.  50MP సోనీ LYT 808 1/1.4 అంగుళాల ప్రధాన కెమెరా, 50MP సోనీ LYT 600 1/1.95 అంగుళాల పెరిస్కోప్‌ కెమెరా, 50MP అల్ట్రావైడ్‌ కెమెరాలు సహా LED ఫ్లాష్‌ లైట్‌ ఉంటుందని తెలుస్తోంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. 6000mAh లేదా 6100mAh బ్యాటరీతో పనిచేసే అవకాశం ఉంది. దీంతోపాటు 100W వైర్‌, 50W వైర్‌లెస్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉండే అవకాశం ఉంది. గత మోడల్ 5400mAh బ్యాటరీని మాత్రమే కలిగి ఉంది. భద్రత కోసం అల్ట్రాసోనిక్‌ ఇన్‌ స్క్రీన్‌ ఫింగర్ ప్రింట్‌ స్కానర్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు IP68 లేదా IP69 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా రానుంది. కనెక్టివిటీ పరంగా USB-C ఛార్జింగ్‌ పోర్టు, బ్లూటూత్‌, వైఫై, GPS వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.


Post a Comment

0 Comments

Close Menu